— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కొంచర్ల భూపాల్ రెడ్డి
Koncharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం పై తెలంగాణ హైకోర్టు తీర్పును గౌరవి స్తామని, కానీ మాకు న్యాయం జరిగే వరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Koncharla Bhupal Reddy)పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో (media) చిట్ చాట్ నిర్వహిం చారు. నల్లగొండ జిల్లా కలెక్టర్, ము న్సిపల్ కమిషనర్ మాకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. పార్టీ కార్యాలయాల కూల్చివేత విష యంలో బిజెపి, కాంగ్రెస్ మిలాఖత్ అయిందా అని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపి అంటే బుల్డోజర్ అంటూ ఢిల్లీ వీధుల్లో గగ్గోలు పెట్టిన రాహుల్ గాంధీ, తెలంగాణలో కూ లగొట్టే సంస్కృతితో పని చేస్తున్న కాంగ్రెస్ అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కూ ల్చుకుంటూపోయే వల్లకాడని అభివర్ణించారు. భూపాల్ రెడ్డి (Koncharla Bhupal Reddy)అంటే సస్యశ్యామలంతో నిల బెట్టడం అని స్పష్టం చేశారు.నీవు కూల్చేకొద్దీ, మేము విజృం బిస్తామంటూ హెచ్చరించారు. ప్రజలకు ఏదో ఉద్దరిస్తామని గెలి పిస్తే కూల్చడంలో, ఆగం చేయడం లో అభివృద్ధి చూపుతున్నారని కో మటిరెడ్డికి కచ్చితంగా బుద్ధి చెప్పే సమయం మాకు కూడా వస్తదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించా రు. దేశంలో ఏ పార్టీకి అయినా కార్యాలయమే దేవాలయం లాం టిదని గుర్తు చేశారు. పార్టీ ఆఫీసు లేని రోజుల్లోనే రోడ్లపై, పట్టాలపై (On roads, on rails)పడుకొని పోరాటం చేశామని తెలి పారు. పార్టీ కార్యాలయం అయినా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమా ల కోసం ఉపయోగించామని చె ప్పారు.