Ramana Dikshitu: ప్రజా దీవెన, తిరుమల: తిరుమల వేంకటేశ్వర ఆలయంలో గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేదని టీటీడీ (ttd) ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitu) విచా రం వ్యక్తం చేశారు. వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో (adulterated ghee) స్వామి వారికి మా చేతులతో ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది దురదృష్టం అని వ్యాఖ్యానించారు. ఈ కల్తీ నెయ్యి తో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారని వెల్ల డించారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారు అని వ్యాఖ్యానించారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అప చారం చేసారన్న మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitu) ఆందోళన వ్యక్తం చేశారు.
Thirumala ex archakulu Ramana diksuthulu pic.twitter.com/TVKEcZAYRd
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 20, 2024