–గచ్చిబౌలి స్టేడియం సందర్శించిన కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండ్వియా
Mann Sukh Mandvia: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోని విద్యార్థులు యువత చదువుతోపాటు క్రీడల పై దృష్టి సారించాలని కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండ్వియా (Mann Sukh Mandvia) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ఆయన గచ్చిబౌలి స్టేడి యాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జిఎంసిబి స్టేడియం లో ఉన్న క్రీడా వసతులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న వసతులను ఆయన పరిశీలించారు.తదుపరి సాయి సెంటర్ లో శిక్షణ పొందు తున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం 2036 ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇ వ్వాలని సంకల్పిస్తోందని, ఒలం పిక్స్ స్థాయిలో మన క్రీడాకారులను (Sportsmen)తీర్చిదిద్దే ప్రణాళికతో అన్ని క్రీడా సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయా లని కోరారు.తదుపరి ఆయన పారా ఒలంపియన్ దీప్తి జీవన్ జీతో పాటు సాయి హైదరాబాద్ సెంటర్ అథ్లెట్స్ మెడలిస్టులను ఆయన సత్కరించారు.గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తు న్న బ్యాడ్మింటన్ సార్ పీవీ సింధు తో కలిసి కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. హాకీ కబడ్డీ అథ్లెటిక్ క్రీడా కారులతో కొద్దిసేపు సంభాషించారు .
ఖేలో ఇండియా నిధులు అధి కంగా కేటాయించండి .. తెలం గాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తెలం గాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి కేంద్ర మంత్రిని కోరా రు.ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. నైపుణ్యాల నేల తెలంగాణకు ఘనమైన క్రీడా చరిత్ర ఉందని ప్రతిష్టాత్మక ఒలంపిక్స్ తో పాటు జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లలో రాణించిన అనేకమంది క్రీడాకారులను తెలంగాణ ఉత్పత్తి చేసిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రామాణిక స్విమ్మింగ్ పూల్స్ బహుళర్ధసార్థక ఇండోర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ షూటింగ్ రెయిన్ హాకీటర్ సైక్లింగ్ విలోడ్రం టెన్నిస్ కాంప్లెక్స్ ఫుట్బాల్ మైదానాలు స్కేటింగ్ ట్రాక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడా సౌకర్యాలు (Tracks Water sports sports facilities) కలిగిన గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఎల్ బి స్టేడియం కే వి ఆర్ ఇండోర్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్ తోపాటు హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని భవిష్యత్తులో జరిగే ఒలంపిక్స్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు తోపాటు వివిధ ప్రపంచ ఛాంపియ న్షిప్లు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు ఆసియా నిర్వహిం చడానికి తెలంగాణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఇందు కొరకు కేంద్ర ఆర్థిక సాయం అందించాలని ఆ లేఖలో అభ్య ర్థించారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడా సౌకర్యాల (Sports facilities)అభి వృద్ధికి మల్లికా సదుపాయాల మెరుగుదల కొరకు ఖేలో ఇండియా పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహా దారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెల పాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యువజన అభివృద్ధి పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ (Sports is a cultural branch)ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజియన్ అధికారులు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.