Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brinjal: ఈ రోగాలు ఉన్న ఎవరు వంకాయ తినకూడదు..!

Brinjal: మనలో చాలా మందికి వంకాయ అంటే చాల ఇష్టంగా తింటూ ఉంటారు. నిజానికి వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా ఇష్టంగా తింటారు.. అలాగే వంకాయతో కూర, ఫ్రై, చట్నీ ఇలా .. ఎన్నో రకాలు వంటకాలు చేసుకొని తింటారు..నిజానికి వంకాయతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి అనేక మేలు చేస్తాయి.. కానీ వంకాయ తినడం కొందరికి విషంలా హానికరం కావొచ్చు.. ఎందుకంటే.. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు వంకాయను తినకపోవడమే మంచిదని డాక్టర్లు (DOCTERS)తెలుపుతున్నారు. వంకాయ తినడం వాళ్ళ కలిగే సమస్యలు ఈ రోగాలు ఉన్న వారు వంకాయను ఎప్పుడూ తినకూడదు.. ఎందుకంటే వంకాయ తినడం వారికి తీవ్రంగా హాని వస్తుంది అవి ఏమిటంటే.

మెయిన్ గా గ్యాస్, అజీర్ణం (Gas, indigestion) వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకుండా ఉండడం మంచిది. ఇలాంటి సమయంలో వంకాయ తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కనుక పేలవమైన జీర్ణక్రియ లేదా గ్యాస్ లేదా అసిడిటీ ఉన్నవారు వంకాయ తినకుండా ఉండండి.

ఇక రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండండి. అలాగే ఆరోగ్య నిపుణుల నివేదిక ప్రకారం. వంకాయలో శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అంశాలు ఉన్నాయి. దీని కారణంగా, రక్తం లేకపోవడం సమస్య తీవ్రమవుతుంది. రక్తహీనత ఉన్నవారు వంకాయను తినకుండా ఉండండి.

ఇక ఎవరైనా మూత్రపిండాల (kidney) వ్యాధి లేదా రాళ్లు ఉన్నవారు వంకాయకు చాల దూరంగా ఉండాలి. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు వంకాయను ఆహారంలో చేర్చుకోకుండా ఉండటం మంచిదని డాక్టర్లు సూచనా.

ప్రస్తుత రోజులలో చాల మందికి కీళ్ల నొప్పులు(Joint pains) ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. అలంటి వారు వంకాయను తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంకాయలో సోలనిల్ ఉంటుంది. దీని కారణంగా, శరీరం వాపు, కీళ్ల నొప్పులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ.

మనలో చాల మందికి చాల సందర్భాలలో వంకాయ తినడం వల్ల అలర్జీ వస్తుంది. వంకాయ తిన్న తర్వాత మీకు ఇలా అనిపిస్తే, వెంటనే డాక్టరును సంప్రదించండి.. అలాగే వంకాయ తినడం మానేయండి. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వంకాయ తినకుండా ఉండటం చాలా మంచిదని డాక్టర్లు సూచనా..