Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Online Shoping: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారు ఈ టిప్స్ తప్పని సరి..!

Online Shoping: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ (Flipkart, Amazon)ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు వినియోగదారుల కోసం రకరకాల అనేక ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. వారంలో బిగ్‌బిలియన్‌ డేస్‌, గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్‌ పేరుతో ఈ కామర్స్‌ దిగ్గజాలు కస్టమర్స్ కి ఆఫర్స్ అందిస్తుంది. ప్రస్తుత రోజులలో చాలా మంది కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు (Online Shoping) మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు సైతం ఆఫర్ల మీద ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి . ఈ తరుణంలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. లేకపోతే మోసపోయే అవకాశం కచ్చితం.

అలాగే కొన్ని టిప్స్ (tips) పాటిస్తే ఎంతో మంచిది. మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి ముందుగానే పెట్టుకోవాలి. ఇంకా సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయడం మంచిది. అలాగే కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు ఎదురు చూడటం వృథానే అనే చెప్పాలి.ఇక . ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ ఇస్తాయి కానీ స్క్రీన్‌లపై (screens) కనిపిస్తున్న డిస్కౌంట్స్ (Discounts)చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా మాత్రం కచ్చితంగా ఉండాలి.

అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ కోసం మనం చూడకూడదు. మీరు ధరలను చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు ధర తక్కువ ఉందో ఎక్కువ ఉందో ఈజీ గా తెల్సుకోవచ్చు. అలాగే ప్రస్తుత రోజులలో డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌కే అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం అనేది సాధారణంగా మారిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్త అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంటున్నారు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో (Amazon, Flipkart) వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.

మనం ముందుగా మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాలి. ఇక కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి. మరికొన్ని ప్రోడక్ట్స్‌ (Products)అయితే కేవలం అమెజాన్‌లో లభిస్తాయి. కానీ చాలా వరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుకోలు చేయడం మంచిది. ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ కొనే సమయంలో ఇలాంటి జాగ్రతలు తప్పని సరి.