Tammineni Ramesh: ప్రజా దీవెన, కోదాడ: కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని రమేష్ (Tammineni Ramesh) మృతి పార్టీకి గ్రామ శాఖకు తీరని లోటు అని కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినే హనుమంతరావు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లుప్రసాద్, దొడ్డా వెంకటయ్య అన్నారు కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన తమ్మినేని రమేష్ (Tammineni Ramesh)శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం తమ్మర గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ (Matangi Prasad) ఆధ్వర్యంలో రమేష్ నివాస గృహానికి వెళ్లి పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి పూలమాలతో నివాళులర్పించారు అనంతరం బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ తమ్మినేని రమేష్ మృతి బాధాకరమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు తమ్మినేని రమేష్ కుటుంబం అంతా కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలు చేశారని అలాగే గ్రామంలో పార్టీ బలోపేతానికి (To strengthen the party)కృషి చేశారని తెలిపారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో పోతురాజుసత్యనారాయణ కమతం పుల్లయ్య బత్తినేని శ్రీనివాసరావు గొట్టేముక్కల కోటి నారాయణ కొండా కోటేశ్వరరావు నిడిగొండ రామకృష్ణ కమతం మురళి పసుపులేటి గోవిందరావు గోసు దిబ్బయ్య, మాతంగి గాంధీ, మాతంగి ఏసు, యలగందుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు