Daughter’s Day: ప్రజా దీవెన, హైదరాబాద్: పురాతన కాలం నుంచి అబ్బాయి (boy)పుడితే ఒకలాగా అమ్మాయి పుడితే మరో లాగా చూసే అల వాటు మనదేశంలో ఉంది. ఇప్ప టికీ కొడుకులను ఎక్కువ చేసి మాట్లాడే సాంప్రదాయం కొనసాగు తుంది.కానీ ఈ తరం ఆడపిల్లలు మేమేమి తక్కువ కాదని కొడుకులతో సమానమే నని, ఏ రంగంలోనైనా వెనకాడబోమని,ఆడపిల్లలు నిరూపిస్తున్నారు.అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా’ అంటూ ఓ సినీ గేయ రచయిత స్త్రీ (woman) గొప్పతనాన్ని పాటలో వివరించారు.
మహిళలు అడుగిడని రంగం లేదు.. సాధించని కొలువు లేదు. అటు జన్మనిచ్చినవారి కలలను, ఇటు తమ లక్ష్యాలను సాధించుకుంటూ వన్నెతె స్తున్నారు. ఆడపిల్లలు.. నేడు కుమార్తెల దినోత్సవం (Daughter’s Day)సెప్టెంబర్ 22ఆదివారం నిర్వహిస్తున్నారు. భారత దేశంలో ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి కూతుర్ల దినోత్సవన్ని మనం ఘనం గా నిర్వహించుకుందాం.