Chiranjeevi: కొణిదెల శివశంకర వరప్రసాద్(Sivashankara Varaprasad).. అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.(Megastar Chiranjeevi.). ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు ఆధిపత్యం చెలాయించిన హీరోలలో ఆయన ఒకరు. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలులలో (politics) కూడా ఆయన పాత్ర పోషించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. అయితే అనుకోకుండా వెళ్లిన రాజకీయాలను వదిలేసిన తర్వాత మళ్లీ ఆయన సినిమాల వైపు ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో తన 150 సినిమాగా ఖైదీ నెంబర్ 150 తో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈ సంవత్సరం మొదట్లో పద్మ విభజన అవార్డు అందుకున్న ఆయన తాజాగా మరో అవార్డును కూడా దక్కించుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హైదరాబాదులోని ఐటీసీ కోహనూర్ (ITC Kohanoor) లో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్లో భాగంగా ఈ విషయాన్ని మీడియా పూర్వకంగా తెలిపారు. మోస్ట్ ప్రొలిపిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనే కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ (Guinness Book) లో పేరు సంపాదించారు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల్లో నటించి 537 పాటలకు గాను 24 వేల డాన్స్ స్టెప్పులు వేసింది తను ఈ రికార్డ్ అనౌన్స్ చేశారు. ఈ లిస్టులో ఇప్పటికే హాస్యబ్రహ్మగా పిలవబడే బ్రహ్మానందం కూడా చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.