–నేషనల్ హైవే అథారిటీకి ఫిర్యా దు చేసిన ఎమ్మెల్యే
— త్వరలో తీరనున్న జడ్చర్లవా సుల కష్టాలు
Janampally Anirudh Reddy: ప్రజా దీవెన, జడ్చర్ల : జడ్చర్లవాసు లకు సంకటంగా మారిన సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని నేషనల్ హైవే ఉన్నతాధికారులు హామీ ఇచ్చా రని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Janampally Anirudh Reddy) వెల్లడించారు. ఈ విషయం గురించి తాను హైవే అ థారిటీ అధికారులతో ప్రత్యేకంగా కలిసి సిగ్నల్ గడ్డ రోడ్డు గురించి ఫి ర్యాదు చేసానని చెప్పారు.జాతీయ రహదారి నెంబర్ (National Highway No)167 నిర్మాణ ప నుల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలో ని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో వంతెన తో పాటుగా రోడ్డును నిర్మిస్తున్నా రు. అయితే ఈ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ ఉదాసీనత, రైల్వే శాఖ నుంచి కొన్ని క్లియరెన్స్ లు రావాల్సి ఉండటం లాంటి వివి ధ కారణాలతో ఈ రోడ్డు నిర్మాణం సంవత్సరాల తరబడిగా కొనసా గుతోంది. పనులను కొంత కాలం చేసిన గుత్తేదారు వివిధ కారణాల ను చూపుతూ నిర్మాణ పనులను చాలా కాలంగా నిలిపివేయడంతో ఏళ్ల తరబడిగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణపనుల్లో భారీ గుం తలు ఏర్పడ్డాయి.
దీంతో ఈ మా ర్గంలో వాహనాల రాకపోకలకు (Vehicular traffic) ఆటంకం కలుగడంతో పాటుగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగు తోంది. ప్రత్యేకించి వర్షాల కారణం గా ఈ రోడ్డు గుంతల్లో బురద పేరు కుపోవడంతో ఆ ప్రాంతంలో ప్రజ లు తిరగడానికి ఇబ్బందులు పడా ల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఈ విష యం గురించి ప్రజలు ఫిర్యాదులు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే అనిరుధ్ రెడ్డి సోమవారం నేషనల్ హైవే అథారిటీ (National Highway Authority)అధికా రుల కు ఈ రోడ్డు గురించి ఫిర్యాదు చేసారు. నేషనల్ హైవే అథారిటీ రీజనల్ హెడ్ కృష్ణ ప్రసాద్ కు జడ్చ ర్ల సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితిని, ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థ నిర్ల క్ష్యాన్ని గురించి ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియో లను కూడా ఆయనకు చూపిం చారు. ఈ విషయంగా స్పందించిన ఆర్ఓ కృష్ణ ప్రసాద్ దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, 30 రోజుల్లోపుగా సిగ్నల్ గడ్డలో బీటీ రోడ్డు (Beatty Road) వేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అనిరుధ్ రెడ్డి మీడియాకు విడుద ల చేసిన ఒక ప్రకటనలో వివరించా రు. హైవే అధికారులు హామీ ఇచ్చి న విధంగానే నెల రోజుల్లో సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్య పరిష్కారమౌ తుందని ఆశాభావం వ్యక్తం చేసా రు. అధికారులు చెప్పిన గడువు లోపుగా సమస్య పరిష్కారం కాక పోతే ఈ విషయాన్ని తాను మరిం త సీరియస్ గా తీసుకొని సమస్య ను పరిష్కరించడానికి కృషి చేస్తా నని పేర్కొన్నారు.