Pain Killers: మనలో చాలా మంది సాధారణంగా తలనొప్పి వస్తే మాత్రం ఆ నొప్పి నివారణ మందులు వేసుకుంటూ ఉంటాం. అయితే చిన్నపాటి నొప్పులకు కూడా పదే పదే టాబ్లెట్స్ (Tablets) వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు అంటున్నారు. అలాగే కొందరు శరీరంలోని ఏ భాగంలోనైనా కొంచెం నొప్పిగా అనిపిస్తే వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఆలా నొప్పి తగ్గించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇలా రకరకాల నొప్పులకు ఇలా పదేపదే మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు డాక్టర్లు . అయితే పెయిన్ కిల్లర్స్ (Pain Killers) పదే పదే వాడడం వల్ల వచ్చే సమస్యలు మనం ఇప్పడు చూద్దాం..
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణశయాంతర సమస్యలు ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ (Aspirin, Ibuprofen)వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) దీర్ఘకాలిక వినియోగం కడుపు చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం సమస్యలు ఎక్కువగా వస్తాయి.అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల మన కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. ఇలా అవవడంతో వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. దీనితో దీర్ఘకాలిక వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యం (Chronic diseases, kidney failure) అయ్యే ప్రమాదం ఎక్కువ.మనలో ఎవరైనా ఎసిటమైనోఫెన్ (పారాసెటమాల్) ఎక్కువగా తీసుకుంటే, అది కాలేయం వైఫల్యానికి కారణం అవుతుంది.
అలాగే కొందరికి పెయిన్ రిలీవర్లను ఎక్కువగా వాడటం వల్ల తలనొప్పి (headache)సమస్య రావచ్చు. ఇలాంటోయ్ రకమైన తలనొప్పులు చాలా ప్రభావం చూపుతాయి. అలాగే ఈ పెయిన్‌కిల్లర్స్‌ను (Pain Killers) వాడే సమయంలో నాలుగైదు గంటల తేడాతో వేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఇక కేవలం వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ వాడకూడట. ఒక వేళా అవి వేసుకున్న కూడా నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే లేదా తరచుగా సంభవిస్తే వైద్యుడి దగ్గరుకు వెళ్లడం మంచిది. ఏది ఏమైనా కానీ ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడడం ప్రమాదమే అని చెప్పాలి.