Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmers: పాడి రైతులకు శుభవార్త… నేడు పాత బకాయిల చెల్లింపు

Farmers: ప్రజా దీవెన, హైదరాబాద్: పాడి రైతులకు (Dairy farmers) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. మంగళవా రం పాడి రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం కా ర‌ణంగా పాడి రైతులు (farmers) తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకున్న ప్రభు త్వం బిల్లులు చెల్లించేందుకు నిధు లు మంజూరు చేసిందన్నారు.

బిల్లుల విషయంలో ఆందోళన చెందవద్దని పాడి రైతులు (farmers) విజ్ఞప్తి చే శారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు విజయ డెయిరీ పాలను కొనుగోలు చేస్తోందని, బిల్లుల చె ల్లింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. రూ.50 కోట్ల చెల్లింపు పూర్తి చేసి మిగిలిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తానని హా మీ ఇచ్చారు.

అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యి (Vijaya Dairy Ghee)ఇక తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తెలం గాణలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేయనున్నట్టు తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్‌ సొసైటీ (Telangana Dairy Development Society) ఛైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి విజయ డెయిరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయా లకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాల లకు, జైళ్లు, ఆస్పత్రులకు అవస రమైన పాలు, పాల పదార్థాలను సరఫరా చేయనున్నట్టు అమిత్ రెడ్డి పేర్కొన్నారు.