–మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
–తిరులమలో డిక్లెరేషన్ ఇవ్వా ల్సిన బాధ్యత లేదా
–అధికారం ఇచ్చింది సంప్రదాయా లను గౌరవించేందుకే
— తిరుమల పోటు లో ప్రమాదం జరిగితే ఏముందిలే అంటారా
— ఇప్పటికైనా అందరికి క్షమాపణ చెప్పాలి జగన్
Chandra Babu: ప్రజా దీవెన, అమరావతి: గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్ర బాబు (Chandra Babu)అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ (jagan) దేవుడిని దర్శించుకోవచ్చని , కానీ ఆయనకు వేంకటేశ్వ రస్వా మిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని నిలదీశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు (Chandra Babu)పోస్ట్ చేశారు.నమ్మకం ఉంటే అన్యమత స్థులు సంప్రదాయం ప్రకారం తిరు మలలో డిక్లరేషన్ ఇవ్వాలి. అలా డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎం దుకు వెళ్లాలి మీకు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరు ద్ధంగా పని చేయడానికి కాదు.
అది అడిగితే బూతులు తిట్టారు. వైసిపి హయాంలో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆంజ నేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏ మైంది బొమ్మే కదా అన్నారు. హను మంతుడు బొమ్మా వెంకటేశ్వరస్వా మి (Venkateswara Swamy)బొమ్మా రాములవారి తల తీసే స్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకో వచ్చు కదా అన్నారు. రథం కాలి పోతే ఏముందీ తేనెటీగలు వచ్చా యి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుం దని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడు తూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవం తుడే చూసుకుంటాడు అని పేర్కొ న్నారు. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్ట్ కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం అంటూ ట్వీట్(tweet)చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.