Roja Poll: ప్రజా దీవెన, అమరావతి: నెటిజన్ల రియాక్షన్ ఊహించలేక.. మాజీ మంత్రి రోజా (Roja) తాను పెట్టిన పోస్ట్‌తో పాటు ఏకంగా ఛానల్ ని డిలీట్ చేయాల్సివచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘోరంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ (YSRCP) నేతల్లో మాజీ మంత్రి రోజా ఒకరు. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో జరిగిన అపవిత్రం పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
ఈ వ్యవహారంపై రోజా స్పందిస్తూ.. సోషల్ మీడియాలో.. తిరుమలలో ఎవరి పాలన బాగుందని పోల్ పెట్టగా… 24 గంటలు ముగియకుండానే.. 19 వేల మంది ఓట్లు వేయగా.. అందులో చంద్రబాబు పాలన బాగుందని 76 శాతం మంది ఓటు వేశారు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalayan), సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), మాజీ సీఎం జగన్ (YS Jagan) లపై పోల్ పెట్టింది.
ఈ పోల్ కు కూడా.. 23 గంటలకు.. 62 వేల మంది ఓట్లు వేశారు. ఇందులో 72 శాతం మంది మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్లు వేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న రోజా దిద్దుబాటు చర్యలకు దిగింది. తిరుమల వ్యవహారంపై పెట్టిన రెండు పోల్స్(పోస్టులు)ను డిలీట్ చేయడమే కాకుండా.. ఇన్ని రోజులుగా నడుపుకొస్తున్న చానల్ ను కూడా తొలగించింది. దీంతో ఆమె పెట్టిన పోల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నెటిజన్లు మాజీ మంత్రి రోజాను ట్రోల్ చేస్తున్నారు.