Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yellow alert in Telangana: తెలంగాణలో ఎల్లో అలెర్ట్

-- ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతం -- మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో ఎల్లో అలెర్ట్

— ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతం
— మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలో రెండు మూడు రోజులపాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దాదాపు 20 జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలు చేస్తూ శనివారం కొన్ని జిల్లాల్లో ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతo కావడంతో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించడంతో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.