Paladugu Prabhavati: ప్రజా దీవెన, కనగల్: పేద ప్రజల (Poor people) శ్రమ ద్వారానే సంపద ఉత్పత్తి అవుతుందని శ్రమించిన పేదలకు ఫలితం లేదని దోపిడిదారులే బాగుపడుతున్నారని, పేద ప్రజల రాజ్యం రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati) అన్నారు. బుధవారం కనగల్లు మండల కేంద్రంలో కనగల్లు సిపిఎం గ్రామ శాఖ మహాసభ జరిగింది, ఇటీవల అమరులైన అమరవీరులకు వేముల నాగయ్య గారికి జోహార్లు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభావతీ మాట్లాడుతూ ప్రకృతి సంపద వనరులు బూములు, ఘనులు పెట్టుబడుదాల్లో దోపిడిదారులు కారు చౌకగా దోచుకుని ప్రభుత్వాలకు నష్టం కలిగిస్తున్నారని అన్నారు. కనీసం ఉండడానికి ఇల్లు దుండడానికి భూమి లేని నిరుపేద ప్రజలు (Poor people) ఎంతోమంది ఉన్నారు అని అన్నారు. పాలక పార్టీలు ప్రజల నుండి అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నారని సంక్షేమం అభివృద్ధి మాత్రం శూన్యం అని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో హామీలు ఇస్తూ తదుపరి మొండి చేయి చూపుతున్నరని అన్నారు. సిపిఎం (cpm) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని తెలియజేశారు. గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు మహాసభల కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కానుగు లింగస్వామి, ఎండి అక్రమ్, ఎండి సుల్తానా, రాంబాబు, కంబాలపల్లి శ్రీరాములు, మాధవి, సాయమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.