Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: నల్లగొండ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

–రైతు సమస్యలపై ఆందోళన సిద్ధంగా ఉండాలి
–నల్లగొండ జిల్లా మంత్రులు, కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేల, అవినీతి అక్ర మాలపై ఫైర్
–కార్యకర్తలకు పార్టీ నాయకులు అండగా ఉండాలని పిలుపు –త్వరలో పార్టీ కిందిస్థాయి నుండి నిర్మాణం

KTR: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఉమ్మడి జిల్లా నేతలతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President of BRS Party)కల్వకుంట్ల తారక రామారావు (KTR)సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ వ్యవహారాలపై తీవ్రంగా చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యే పని తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. ఇచ్చిన వాగ్దా నాలు నెరవేర్చలేక కాంగ్రెస్ పార్టీ (Congress party) ప్రజలకు ద్రోహం చేసిందని, ము ఖ్యంగా, రైతులను తీవ్ర ఇబ్బం దులకు గురి చేస్తుందని, అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress party)వాటిని, అమలు చేయటానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీ కార్యకర్త లకు ఏ అవసరం వచ్చినా నాయ కులు అందుబాటులో ఉండాలని, త్వరలోనే పార్టీ కిందిస్థాయి నుండి పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ సమా వేశానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, గొంగడి సుది సునీత మహేందర్ రెడ్డి,మాజీ జెడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి(Banda Narender Reddy,), మాజీ రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు, రమావత్ రవీంద్ర కుమార్ ,గాదరి కిషోర్ కుమార్, నల్లమోతు భాస్క రరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరు మర్తి లింగయ్య,బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.