Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Decision to regulate fees: ఫీజుల నియంత్రణకు నిర్ణయం

-- హైకోర్టు ఆదేశాలతో మెమో జారీ

ఫీజుల నియంత్రణకు నిర్ణయం

— హైకోర్టు ఆదేశాలతో మెమో జారీ

ప్రజా దీవెన/హైదారాబాద్: తెలంగాణలో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం.

గవర్నింగ్ బాడీ ద్వారానే ఫీజులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేస్తూ వసూలు చేసిన ఫీజులో 5% మాత్రమే లాభం తీసుకోవాలని హెచ్చరించింది ప్రభుత్వం. 50% సిబ్బందికి జీతాలు ఇవ్వాలని 15% ఫీజు స్కూల్ నిర్వహణకు వాడుకోవాలని, ఫీజుల వివరాలను స్కూల్ వెబ్ సైట్లలో డైరెక్టరేట్ వెబ్ సైట్​లో పెట్టాలని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీబీఎస్​ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఐజీసీఎస్​ఈ స్కూళ్లలోనూ ఫీజులు నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. హైకోర్టు కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వo మెమో ఇచ్చి చేతులు దులుపుకుందని, చట్టం ద్వారానే ఫీజులను నియంత్రించోచ్చని తల్లి దండ్రులు అభిప్రాయపడుతున్నారు.