జమిలీ జట్టు ఇదే
— ఒక దేశం ఒకే ఎన్నికపై కమిటీ ప్రకటించిన కేంద్రo
— కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో కేంద్రం అనుకున్నట్టుగానే ముందడుగు వేసింది.ఒక దేశం ఒకే ఎన్నిక(One Nation One Election) కమిటీని ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ ఆదివారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind)ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి నియమితులయ్యారు.
ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections for five states), వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశం(Special Session of Parliament) ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో జమిలీ ఎన్నికల ప్రతిపాదనతో(With Jamili’s election proposal)ప్రభుత్వం ఉభయసభల ముందుకు రావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
”ఒక దేశం ఒకే ఎన్నిక” అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇందువల్ల సమయం, ఖర్చు ఆదా(Save time and cost)అవుతుందని కేంద్రం చెబుతోంది.