–రిటైర్డ్ అధికారి చొల్లేటి ప్రభాకర్
Cholleti Prabhakar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి (Konda Laxman Bapuji Jayanti)వేడు కలకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చల్లే టి ప్రభాకర్ (Cholleti Prabhakar) ముఖ్య అతిథిగా విచ్చే సి విద్యార్థులను ఉద్దేశించి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను విద్యార్థు లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మ ణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలం గాణ ఉద్యమ నినాదం పలు దఫా లో అందుకొని తన పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన ఆదర్శ మూర్తి అన్నారు. తాను అలంక రించిన అన్ని పదవుల్లో బలహీన వర్గాల అభ్యున్నతికై విశేషమైన కృషి చేసిన మహనీయుడని కొని యాడారు. జాతి నిర్మాణం లో కీలక భూమిక పోషించిన ప్రతి నాయకుడిని అధ్యయనం చేసి స్ఫూర్తిదాయకమైన మార్గంలో పయనించాలన్నారు . ఈ కార్య క్రమంలో ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డా మిరియాల రమేష్, డా మారం వెంకటరమణారెడ్డి, డా లక్ష్మీ ప్రభ, డా దోమల రమేష్, డా నీలకంఠం శేఖర్ తదితర అధ్యా పకులు విద్యార్థులు పాల్గొన్నారు.