Bumper Offer: ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని చోట్ల పండుగల సీజన్ (Festive season) ప్రారంభం అయ్యేంది. ఈ సీజన్‌లో సేల్ ను పెంచుకోవడంతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఈ పండుగ సీజన్‌లో కొన్ని మోడళ్లపై (model)ఆఫర్లను కస్టమర్స్ కోసం ప్రకటించారు. యమహా కంపెనీ ప్రస్తుతం ఫాసినో 125, ర్యాజర్ హైబ్రిడ్ స్కూటర్లతో పాటు ఎఫ్‌జెడ్ మోడల్స్‌పై నమ్మలేని తగ్గింపులను అందిస్తుంది. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4.0, ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 3.0 రెండూ బైక్స్‌పై రూ.7,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చని కంపెనీ తెలియచేసింది. అలాగే ఈ రెండు బైక్స్ రూ.7,999 డౌన్ పేమెంట్‌తో (Down payment)సొంతం చేసుకోవచ్చని కూడా కంపెనీ ప్రకటించింది. అయితే ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వీ4 ప్రారంభ ధర రూ.1.29 లక్షలు కాగా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ వీ3 ప్రారంభ ధర రూ.1.06 లక్షలు, ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అలాగే ఫాసినో 125, ర్యాజర్ హైబ్రిడ్ స్కూటర్లపై రూ.4000 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చని తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో భాగంగా యమహా ఆఫర్ల గురించి మనం ఇప్పడు చూద్దాం..
ఇందులో ముందుగా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4 149 (FZ S FI Version 4 149) సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ (cc fuel injected) ఇంజన్ ద్వారా శక్తి లభిస్తుంది. ఇది 12 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 13.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూటీలో ఉన్న గేర్బాక్స్ 5 స్పీడ్ యూనిట్‌తో లభిస్తుంది. అలాగే సస్పెన్షన్ డ్యూటీల కోసం ముందువైపు టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుకవైపు మోనోషాక్‌తో కూడా వస్తుంది.
ఈ లిస్ట్ లో ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4 (FZS FI version 4 )మాదిరిగానే వీ3 కూడా 149 సీసీ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో 12 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 13.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి కూడా ఉంది . డ్యూటీలో ఉన్న గేర్బాక్స్ 5-స్పీడ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. యమహా ర్యాజర్ 125 ఈ స్కూటర్ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజన్ నుంచి శక్తిని తీసుకుంటుంది. ఈ స్కూటర్ 6,500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 8.2 పీఎస్ శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంకా ఈ లిస్ట్ లో ఫాసినో 125 (Fascino 125)హైబ్రిడ్ బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీని పొందే ఐఆర్ కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ 125 సీసీ ఇంజిన్‌తో పవర్ ట్రెయిన్ ద్వారా శక్తి కూడా లభిస్తుంది. ఈ పవర్ ట్రెయిన్ 6,500 ఆర్‌పీఎం వద్ద 8.2 పీఎస్ గరిష్ట శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 10.3 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ స్కూటర్ యువతను బాగా అక్కటు కుంటుంది. ఎవరైనా బైక్ (bike)కొనాలి అనుకుంటే ఇదే సరైన టైం అనుకోవాలి.