–కలెక్టరేట్ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారా యణ
CH Lakshminarayana: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రా క్ట్ ,ఔట్సోర్సింగ్ క్యాజువల్ టెంపరరీ డైలీ వేజ్ అప్రెంటిస్ హోమ్ బేస్డ్, వివిధ స్కీముల్లో, ప్రభుత్వ శాఖల (Home Based, Various Schemes, Govt)లో పనిచేస్తున్న కార్మికులకు 26 వేల కనీస వేతనం అమలు చేయా లని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీ నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.శనివారం సిఐటియు జాతీయ కమిటీ పిలుపుమేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తున్న కార్మికులకు, అనేక సేవలందిస్తున్న ఉద్యోగు లకు ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తు న్నాయని విమర్శించారు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకా రం 26 వేల వేతన ఇవ్వాలని ఉన్న అనేక రంగాలలో కార్మికులకు అమ లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని విమర్శించారు. కార్మికులకు డైలీ వేజ్ పార్ట్ టైం ఫుల్ టైం టెంపరరీ వంటి ముద్దు ముద్దు పేర్లతో కార్మి కుల శ్రమను ప్రభుత్వాలే (Governments)దోపిడీ చేస్తున్నాయని అన్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మినెంట్ కు నోచుకోవడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా ఎండ మావిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
చట్ట బద్ధంగా కార్మికులకు (For statutory workers)పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాడ్యుటి ఇవ్వా లని చట్టాలు ఉన్న ప్రభు త్వాలు యజమానులు కలిసి అమ లు చేయకుండా కార్మికులను దోపి డి చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమ ల్లో కనీస వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కాల రాసిందని లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పర్మి నెంట్ కనీస వేతనం, ఉద్యోగ భద్ర త సమాన పనికి సమాన వేతనం పిఎఫ్ ఈఎ స్ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాల కోసం ఈనెల 30న జరిగే చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ ధర్నాకు జిల్లా నుండి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ టియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారా యణ,ఎస్ సైదాచారి, వరికుప్పల ముత్యాలు, బొంగరాల మల్లయ్య వివిధ యూనియన్ల నాయకులు పల్లె నగేష్, ఆర్ శ్రీనివాస్ అరుణ పెద్దమ్మ మేకల స్వామి చింత సైదులు తదితరులు పాల్గొన్నారు.