జిల్లాలకు ఎలక్ట్రికల్ బస్సులు
Telangana RTC: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) కీలక నిర్ణయం ప్రస్తు తం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాం డ్ పెరుగుతోన్న విషయం తెలిసిం దే. ప్రజలు పెద్ద ఎత్తున ఈ వాహ నాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల విని యోగానికి మొగ్గుచూపుతున్నాయి.ఇందులో ముందు వరుసలో నిలుస్తోంది తెలంగాణ ఆర్టీసీ, ఇప్ప టికే హైదరాబాద్‌లో పలు రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను నడిపి స్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర వ్యా ప్తంగా దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సు ల్ని (Electric bus) ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావి స్తోంది.ఇందులో భాగంగానే తాజా గా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల (Electric bus)కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్ బస్సుల్ని విస్తరిస్తున్న తరుణంలో కొత్తగా 10 బస్ డిపోలు అవసర పడతాయని ఆర్టీసీ తన ప్రతిపా దలనో తెలిపింది. గతేడాది ఆర్టీసీకి డీజీల్ రూపంలో మొత్తం రూ. 15 22 కోట్ల ఖర్చయింది. ఇది మొత్తం ఖర్చులో 22.7 శాతం దీంతో ఇంధ న భారాన్ని తగ్గించుకునే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద పీట వేస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం హైదరాబాద్‌తో పాటు విజయవా డకు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు నడపిస్తున్న ఆర్టీసీ ఇకపై జిల్లా లకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న డిపోలకు (depots) ఒక్కో డిపో ఏర్పాటుకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 100 కోట్లు.. అలాగే ఒక్కో డిపోకు 10 ఎకరాల చొప్పు మొత్తం 100 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ (rtc) కోరింది. ఇక ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ కోసం 33 కేవీ హై టెన్షన్ విద్యుత్ సరఫరా అవసరమని ఆర్టీసీ ఆలోచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 డిపోలతో పాటు 19 పాత బస్ డిపోలకు హైటెన్షన్ విద్యుత్ సరఫరాకు మరో రూ.232 కోట్లు అవసరపడతాయని ప్రాథమిక అంచనా వేస్తోంది.ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని కోఠి, హయత్‌నగర్ వంటి 10 టెర్మినల్ పాయింట్లలో ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్లు అవసరమని చెబుతోంది ఆర్టీ