Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IPL: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్… ఏమిటంటే

IPL: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ (Hyderabad fans) గుడ్‌న్యూస్ అందనుంది. టీమిండియా ఓవైపు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడు తుంది. మరోవైపు ఐపీఎల్ గురించి చర్చలు జరుగు తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా రోహిత్ శర్మ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. హిట్ మ్యాన్ దారి ఎటువైపు అం టూ అభిమానులు తెగ చర్చించు కుంటున్నారు. ఎవరికి నచ్చిన ట్టుగా వారు సోషల్ మీడియాలో కథనాలు పోస్ట్ చేస్తున్నారు. గత సీజన్ కు ముందు రోహిత్ శర్మను (Rohit Sharma) ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తీసేశారు. దీంతో అతను ప్లేయర్ గానే కొనసాగాడు. అదే సమయం లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్ది క్ పాండ్యాను (Hardik Pandya)యాజమాన్యం తీసు కువచ్చి కెప్టెన్ ను చేసింది. జట్టు పగ్గాలు అప్పగించిం ది.అప్పటి నుంచి రోహిత్ (Rohit) అభిమానులు ఆగ్ర హం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముంబైని హిట్ మ్యాన్ వదిలీ వేయాలని కోరారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా పాండ్యా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫల మైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రాణించలేక పోయాడు.

అయితే ప్రస్తుత ఈక్వేషన్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ ను రోహిత్ వదిలీ వేయడమా లేదా రోహిత్ శర్మనే ముంబైని వీడడం ఖాయం అంటూ చర్చలు జరుగుతున్నాయి. వేలానికి హిట్ మ్యాన్ కనుక వెళ్తే భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి కొన్ని ఫ్రాంచైజీలు (Franchises)ఆసక్తిని కనబ రుస్తున్నాయి. సన్రైజర్స్ లోకి హిట్ మ్యాన్ వెళ్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై రోహిత్ శర్మ కానీ, ఫ్రాంచైజీ కానీ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. కొందరు అభిమానులు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ లోకి హిట్ మ్యాన్ రావాలని కోరుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. డీసీ తరఫున మూడు సీజన్లు ఆడాడని అంటున్నారు. ఐపీఎల్ (ipl)కెరియర్ ఆరంభించిన చోటుకే మళ్లీ రావాలని అంటున్నారు. తోలుత డీసీ తరఫున ఆడిన రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్ తో జతకట్టాడు. అప్పటినుంచి అదే జట్టుతో ప్రయాణం కొనసాగిస్తు న్నాడు.2013లో కెప్టెన్ అయ్యా డు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్స్ ను అందించాడు.