–నాడు కేసీఆర్ చెప్పి చేయలేని ప ని నేడు సీఎం రేవంత్ చేస్తున్నారు
–హరీష్ రావు, కెటిఆర్ పచ్చి అబ ద్దాలు మాట్లాడుతున్నారు
— 80 శాతం ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారు
Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అంత ర్జాతీయ నగరాల చెంతకు చేరబో తున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ (Brand image of Hyderabad)ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని భువ నగిరి పార్ల మెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy)పేర్కొన్నారు.ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వ హించిన మీడియా సమావే శంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో28 వేల అక్రమ కట్టడాలు నాలాల మీద చెరువుల మీద ఉన్నాయని, వాటిని కూల్చేస్తే తప్ప హైదరాబాద్ మనుగడ సాగిం చలేదని, మీడియాతో పాటు ప్రజ లు కూల్చివేతలకు సహకరిం చాల ని నాడు సీఎం హోదాలో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావ్ Harish Rao)ప్రగల్బాలు పలికారని గుర్తు చేశారు.అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో మూసీ ప్రక్షాళన చేయలె, చెరువులు కుంటలు అక్ర మణల నుండి కాపాడ లేకపో యా రని విమర్శించారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆనాడు అసెంబ్లీలో అక్రమ కట్టడాల గురించి పర్మిషన్లు లేని భవనాల గురించి కఠిన చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కఠి నంగా వ్యవహరించాలని అసెం బ్లీలో మాట్లాడారని, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తేడా ఏమిటో తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.
ప్రజల బా లు పలకడం కాదు నాలుగు గోడల మధ్యలో చర్చలు పెట్టడం కాదు చెప్పిన పనిని ఇచ్చే హామీని నెరవే ర్చడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పని అని చెప్పారు. నాడు దేవ తలు అమృతం కోసం పాలసము ద్రాన్ని చిలికే క్రమంలో ముందుగా విషం వచ్చింది విషం రాగానే దేవత లు చిలకడ ఆపలేదు అమృతం వచ్చేవరకు క్షీరసాగర మధనం చేశారని పేర్కొన్నారు. చరిత్ర లో లేక్ సిటీ గా ఉన్న హైదరాబాదును లేక్ సిటీ గానే ఉంచాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాదులో నివసి స్తున్నటువంటి ప్రజలు ప్రతి సంవ త్సరం వర్షాకాలంలో ప్రతి సంవత్స రం వరదలతో ఇబ్బందులు ఎదు ర్కొని, ఇంట్లో వస్తువులు కరవై ప్రభుత్వం చేసే సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి రావద్దని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరా లలో ప్రతి సంవత్సరం వరదలతో హైదరాబాద్ మునిగిపోతుందని, దీనికి ఒక పరిష్కార మార్గం చూపా లని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన తప్ప మరొకటి కాదని వివరించా రు.వర్షాలతో వరదలతో హైదరాబా ద్ ప్రజలు (People of Hyderabad)నష్టపోవద్దని ఉద్దేశంతో నే హైడ్రాను తీసుకొచ్చారని చెప్పా రు. గతంలో మీ మామ కేసీఆర్ 28 వేల ఇండ్లు అక్రమంగా నిర్మించారని చెప్పారు వాటిని కూలగొట్ట లేకపో వడానికి కారణమేమిటో హరీష్ రా వు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత పది ఏండ్లు మీరు చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే ఈరోజు ఈ పేద ప్రజలు అన్యాయమయ్యే వాళ్ళు కాదని తెలిపారు. హైడ్రావల్ల రేవం త్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయంతోనే మీరు ఇలా చేస్తున్నారు కానీ హైదరాబాద్ భవి ష్యత్తు గురించి ప్రతిపక్షాలు ఆలో చన చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.