Free gas scheme: ప్రజా దీవెన, అమరావతి: ఏపీలో సూపర్-6 హామీల అమల్లో భా గంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు (Free cylinders) ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో (Manifesto of NDA Government) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.825.50 (విజయవాడలో) గా ఉంది. ఏడా దికి మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తు తమున్న వంటగ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది.రాష్ట్రం లో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లకార్డు ప్రాతిపదికగా తీసుకుంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. తెల్లకార్డు ఉన్న వీరందరికి ఇస్తే ఏడాదికి 3,640 కోట్లు ఖర్చు అవుతుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. దీపావళి (Diwali)నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం ఖచ్చితంగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇది వరకే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.