Lotus Tea: తామర ఆకుల టీ గురించి మీకు తెలుసా ..?
Lotus Tea: వాస్తవానికి తామర ఆకుల నుంచి తయారు చేసిన టీ అనేది ఒక అద్భుతమైన హెర్బల్ టీ. ఈ టీ లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ టీని ఎండిన తామర ఆకులతో తయారు చేస్తారు. తామర ఆకుల టీ (Lotus Tea) తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనితో అనేక రకాల చిన్నా పెద్ద సమస్యల నుండి శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు చాలా సులువుగా . ముందుగా చైనాలో ఈ టీని ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు ఆసియా అంతట కూడా బాగా ఫేమస్ అవ్వడంతో పాటు డైలీ తాగడం మొదలు పెట్టారు.
తామర ఆకులతో తయారు చేసిన టీ (tea) తాగితే అందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణ ఉంటుంది. తామర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో వాపు, చికాకు కూడా తగ్గుతుంది. ఇక తామర ఆకుల్లో జీవక్రియను పెంచేందుకు సహాయపడే పోషకాలు ఎక్కువ . ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దారి తీస్తాయి. తామర ఆకులతో తయారు చేసిన టీలో ఫైబర్ (Fiber)ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపంచడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇక తామర ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు (Flavonoids, antioxidants) పుష్కలంగా ఉంటాయి. దీనితో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి గుండెను కాపాడుతాయి. అలాగే లోటస్ టీ (Lotus Tea) తాగడం ద్వారా శరీర నొప్పి తగ్గించడంతో పాటు వాపు కూడా తగ్గుతుంది. రోజు ఇలా లోటస్ టీ తాగడం ద్వారా ఒత్తిడి (pressure), ఆందోళనను తగ్గిస్తుంది. ఈ పువ్వులో ఉండే పోషకాలుతో మనకి రిలాక్స్‌గా ఉంచుతాయి. మీరు చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, లోటస్ టీ (Lotus Tea) తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ బాగా పరుగుతాయి. ఇంకెందుకు మీరు కూడా రోజు ఈ టీ ని తాగి మంచి ఫలితాలను పొందండి.