Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు… సీనియర్ సిటిజన్లకు ఆయుష్మా న్ భారత్‌

Ayushman Bharat Scheme: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభు త్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసు కొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme). పేదలకు ఆరోగ్య బీమాను (Health insurance) అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, తాజాగా, ఈ పథకాన్ని 70 ఏళ్లు నిండిన సీనియర్లకు వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ (Central Cabinet) ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో పథకంలో చేరే లబ్దిదారులు పేర్లను నమోదు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ లేఖ రాసింది.ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్‌ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్‌ మొబైల్‌ యాప్‌ (Ayushman), వెబ్‌సైట్‌లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొంది.