Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sunita Williams: 2025 ఫిబ్రవరి లో భూమ్మీదకి సునీత విలియమ్స్

అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగాచేరుకున్న స్పేస్ ఎక్స్ క్రూ-9

Sunita Williams: ప్రజా దీవెన, హైదరాబాద్: కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని (Florida) కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ క్రూ-9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ మిషన్ లో నాసా వ్యోమ గామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ (Nick Hague, Russian cosmonaut Alexander)గోర్బునోవ్ వెళ్లారు. అంత రిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు.

స్పేస్ఎక్స్ క్రూ-9 (SpaceX Crew-9) మిషన్ లో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ తో పాటు సునీత, విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి చేరుకునే అవకాశం ఉంది. క్రూ-9 మిషన్‌ను ఈనెల 26నే ప్రయోగించాలని నాసా, స్పేస్‌ఎక్స్ భావిం చగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ప్రతికూల వాతావ రణ పరిస్థితుల కారణంగా మిషన్ ప్రయోగం వాయిదా పడింది. తిరిగి శనివారం సాయంత్రం క్రూ-9 (SpaceX Crew-9)మిషన్ ను ప్రయోగించారు. ఇదిలాఉంటే.. 2024 జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

అయితే, వారిని తీసుకొ చ్చేందుకు నాసా ప్రయ త్నాలు (NASA’s efforts) ప్రారంభించింది. వ్యోమగాములను స్టార్ లైనర్ పైకి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా నిర్ధారించింది. అంతరిక్ష నౌక సెప్టెంబర్ లో భూమికి తిరిగి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కు కున్న సునీత విలియమ్స్, విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ యొక్క క్రూ-9 మిషన్ ను నాసా ప్రయోగించింది…