Noni Fruit Benefits: మనలో చాల మందికి నోని పండు (Noni Fruit) గురించి తెలిసిందే..కానీ, నోని పండు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అని చాల తగ్గువా మందికి తెలుసు. వాస్తవానికి ఈ పండును తొగరు పండు అని అంటారు. ఈ పండు వల్ల ఔషధ గుణాలు, పోషక విలువలు (Medicinal properties, nutritional value)తెలుసుకున్న తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండించడం మొదలు పెట్టారు. వాస్తవినికి నోని పండు ఔషధాల గని. దీంతో మంచి ఆరోగ్యం మాత్రమే కాకుండా మనకి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కూడా పొందవచ్చు. నోనీ ఫ్రూట్ తింటే మనకి కలిగే లాభాలేంటో మనం ఇప్పడూ తెలుసుకుందాం..
నిజానికి నోని పండు చూడటానికి అచ్చం బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో మనకి మార్కెట్ లో లభిస్తుంది. ఈ పండు లోపల చిన్నచిన్న గింజలు ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానికి యాసిడ్స్ పుష్కలంగా మనకి లభిస్తాయి.
ఈ పండు మనకి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను (Free radicals) తొలగించడంతో పాటు ఆరోగ్యకరమైన కణాలను ఆక్సీకరణం మరియు దెబ్బతినకుండా సహ్యా పడుతుంది. అలాగే రోజు వారి వ్యాయామానికి ముందు.. నోని జ్యూస్ తాగితే శరీరానికి పుష్కలంగా శక్తి మనకి కల్పిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది, కండర కణాలు అరిగిపోకుండా కూడా మనకి సహాయ పడుతుంది. అలాగే నోని పండ్లలో కేలరీలు తక్కువగా లభించిన కూడా ఇది ఫైటో న్యూట్రియెంట్ల స్టోర్ హౌస్ అని పిలుస్తారు. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వివిధ జీవరసాయన ప్రతిచర్యలకు ఆహారాన్ని శక్తిగా (energy) మార్చడం ద్వారా సరైన జీవక్రియను సంరక్షించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంకా నోని పండ్లలో.. పొటాషియం (Potassium) సమృద్ధిగా లభిస్తుంది. దింతో హైపర్ టెన్షన్‌ను (Hypertension)తగ్గించడానికి, రక్తపోటును కంట్రోల్లో ఉంచడానికి, లక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, శరీరంలోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచడానికి పొటాషియం బాగా సహాయపడు తుంది. మనం ప్రతి రోజూ ఒకటి నుంచి రెండు గ్లాసుల నోని జ్యూస్ తాగితే మాత్రం బంధన కణజాలం వశ్యత మెరుగు పడడంతో పాటు.. దీనిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, వాపును తగ్గించి, నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ అందిస్తుంది.