Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామ స్వ రాజ్యానికై కలలుగన్న పూజ్య బాపూజీ ఆశలు, ఆశయాలను నిజం చేసే విధంగా కలిసి పని చేద్దా మని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (Narayana Reddy) పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించు కొని బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఆంగ్లేయుల పాలన నుండి అహిం సాహిత మార్గంలో సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా సత్యాగ్రహం ప్రాముఖ్యతను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి గాంధీజీ (Gandhiji)అని కలెక్టర్ అన్నారు. గ్రామ స్వరాజ్యా నికై ఆయన కన్న కలలు నిజం చేసేందుకు జిల్లాలోని అన్ని గ్రామా లు, మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ఇందు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ డిజిట ల్ కార్డును ఇవ్వాలన్న ఉద్దేశంతో పైలట్ పద్ధతిన చేపట్టిన కార్యక్ర మం గురువారం నుండి నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియో జకవర్గాలలో ఒక మున్సి పాలిటీ, ఒక గ్రామ పంచాయతీలో పైలెట్ పద్ధతిలో సర్వే నిర్వహించనున్నా మని తెలిపారు.
ఇందుకుగాను సర్వే బృందాలు ఎంపిక చేసిన గ్రామాలు ,మున్సిపాలిటీలలో (In villages and municipalities)పర్యటించనున్నాయని, ప్రజలు వారి వారి ఆధార్ కార్డు తో సహా, అందుబాటులో ఉండి వారి కుటుం బ వివరాలను తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం ఆధార్ కార్డు వ్యక్తిగతంగా మాత్రమే ఉపయోగప డుతున్నదని, ఆధార్ కార్డు లాగే కుటుంబం మొత్తానికి కుటుంబ డిజిటల్ కార్డు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమా న్ని చేపట్టినట్లు ఆయన వెల్లడిం చారు.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, ఇన్చార్జ్ ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాసులు, తదిత రులు గాంధీ విగ్రహాన్ని పూలమాలవేసి నివాళు లర్పించారు. అంత కుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి .పూర్ణ చంద్ర గాందీ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణ చంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యా లయ విభాగాల అధిప తులు , కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటా నికి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించారు .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
