Jasprit Bumrah: ప్రజా దీవెన, న్యూఢిల్లీ:870 రేటింగ్ పాయింట్స్‌తో (Rating Points) నం.01 టెస్టు బౌల ర్‌గా బుమ్రా తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకిం గ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నం.01 స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీ వల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో (Bangladesh Test Series) అద్భుతంగా రాణించిన బు మ్రా ఏకంగా 870 రేటింగ్ పాయిం ట్లతో నం.01 ర్యాంక్ దక్కించుకు న్నాడు. టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెన క్కి నెట్టి మరీ బుమ్రా నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు.
అశ్విన్ 869 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానం లో నిలిచాడు. దీంతో ర్యాంకింగ్స్ లో ఇలా ఇద్దరు భారత బౌలర్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఇక బంగ్లాతో టెస్టు సిరీస్ (Test series)లో ఈ ఇద్దరూ కూడా చెరో 11 వికె ట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. కానీ, బుమ్రా మంచి ఎకానమీతో బౌలింగ్ (bowling) చేయడం అతనికి కలిసొ చ్చింది.ఈ ఇద్దరి తర్వాత టాప్-5 లో హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, కగి సోరబాడ ఉన్నారు. అలాగే టీమిండి యా మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో సమయంలోనూ జస్ప్రీత్ బుమ్రా నం.01 ర్యాంక్ సాధించాడు. అప్పుడు కూడా మూడు స్థానాలు ఎగబాకి అశ్విన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. మరోవైపు ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా బుమ్రానే. 2024లో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన పేసర్ ఏకంగా 38 వికెట్లు పడగొట్టాడు. అటు శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఏడు టెస్టులే ఆడి 38 వికెట్లే తీశాడు. కానీ, బౌలింగ్ సగటులో మాత్రం మనోడే మెరుగ్గా ఉన్నాడు. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్, కేన్ విలియమ్సన్, యశస్వి జైస్వాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. భారత యువ సంచలనం జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని మూడో ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం.
అదేవిధంగా కింగ్ కోహ్లీ ఎగబాకి అశ్విన్‌ను (Ashwin)వెనక్కి నెట్టి నంబర్‌వ న్‌గా నిలిచాడు. మరోవైపు ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్య ధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా బుమ్రానే. 2024లో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన పేసర్ ఏకంగా 38 వికెట్లు పడగొట్టాడు. అటు శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూ ర్య కూడా ఏడు టెస్టులే ఆడి 38 వికెట్లే తీశాడు. కానీ, బౌలింగ్ సగటులో మాత్రం మనోడే మెరుగ్గా ఉన్నాడు. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్, కేన్ విలియమ్సన్, యశస్వి జైస్వాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. భారత యువ సంచలనం జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని మూడో ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం. అలాగే కింగ్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకులో నిలిస్తే.. రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి చేరాడు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు స్థానాలు దిగజారి 15వ స్థానానికి పరిమితమయ్యాడు.