Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pirola ringing the danger bells: డేంజర్ బెల్స్ మోగిస్తున్న పిరోలా

-- ఒమైక్రాన్‌కి సబ్ వేరియంట్‌ గా రూపాంతరం -- ఆందోళనతో అలెర్ట్ అయిన ప్రపంచ దేశాలు

డేంజర్ బెల్స్ మోగిస్తున్న పిరోలా

— ఒమైక్రాన్‌కి సబ్ వేరియంట్‌ గా రూపాంతరం
— ఆందోళనతో అలెర్ట్ అయిన ప్రపంచ దేశాలు

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: కరోనా ఆ తర్వాత ఒమిక్రాన్, ఎరిస్ ఇలా సీజన్ కో రకంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  వైరస్ లు నేడు ‘ పీరోలా రూపంలో మరోమారు మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.కరోనా మహమ్మారి మనల్ని వదిలేలా లేదు ఎంత దూరం తరిమికొడుతున్నా కొత్త రూపం సంతరించుకొని అది తిరిగి మన మీద దాడి చేస్తూనే ఉంది.

2020-21 మధ్యకాలంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించి ప్రజలకు గుండెదడ పుట్టించిన విషయం తెలిసిందే. ఎంతోమంది పొట్టబెట్టుకున్న ఈవైరస్ ప్రభావం తగ్గిపోయిందని అంతా ఊపిరి పిల్చుకున్నారు. కానీ అసలు కథ ఇంకా మిగిలే ఉంది అంటోంది కొత్త వేరియంట్.

ఈ వైరస్ పూర్తిగా కనుమరుగు కాకపోయినా జనాలు దీంతో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అలా అంతా సెట్ అనుకున్న సమయంలో కరోనా రక్కసి తన రూపాల్ని మార్చుకుంటోంది. మళ్లీ మళ్లీ ప్రపంచంపై తిరిగి దాడి చేస్తోంది. తాజాగా ఈ వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.

గత భయానక పరిస్థితులను మరువక ముందే ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి, డేంజర్ బెల్స్ మోగిస్తోంది.కొత్త వేరియంట్ ధాటిని చూస్తే మిగతా దేశాల్లో కూడా అలర్ట్ తప్పదన్న క్లారిటీ వస్తోంది. ఆ కొత్త వేరియంట్‌ పేరు BA.2.86, పిరోలా  ఇది ఒమైక్రాన్‌ వేరియంట్‌కి సబ్ వేరియంట్‌ అని చెపుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే పిరోలాలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని, అందువల్లే అది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
*2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో కనుగొన్న పిరోలా…* పిరోలా 2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో మొదటి సారి కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికా, బ్రిటన్, చైనా ఇజ్రాయెల్, కెనడా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. యూకేలో కొత్తగా తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి.

ఇది టీకాలు తీసుకున్న వ్యక్తులకు కూడా సోకుతుంది. అయితే తాజా వేరియంట్‌కి సంబంధించిన సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉన్నందునా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. పిరోలాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం దాని వ్యాప్తి గురించి అంచనాకి రావడం కాస్త కష్టంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త వేరియంట్ పిరోలా లక్షణాలు ఇతర కోవిడ్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, నిరంతర తలనొప్పి, కండరాల తిమ్మిరి, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, చికాకు, నీరసం దీని లక్షణాలు తెలిపారు. పిరోలా వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు భిన్నంగా ఉన్నాయని, ఇందులో మొత్తం 36 మ్యుటేషన్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ఇవి రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలవని, తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదరకమైనది అని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఇంకా పిరోలాపై అధ్యయనం చేస్తున్నారు.