Kakatiya Seva Sangam: ప్రజా దీవెన, కోదాడ:దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో కాకతీయ సేవా సంఘం ఆధ్వర్యంలో (Kakatiya Seva Sangam) కనకదుర్గ అమ్మవారు (Kanakadurga Amma) కొలువు దీరిన మంటపం ఏర్పాటు చేశారు గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా పీటల మీద కూర్చున్న దంపతులు పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు కృపారాణి (PACS Chairman Nalajala Srinivasa Rao Kriparani), వీరేపల్లి బ్రహ్మయ్య చౌదరి అరుణ, వీరేపల్లి వెంకటయ్య సైదమ్మ, వీరేపల్లి నాగేంద్రప్రసాద్ ఝాన్సీ లు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాషా బోయిన భాస్కర్, నెట్టెం నాగేంద్ర, నలజాల రామారావు, మామిడి సైదులు,యానాల బాబురావు, యానాల సత్యం, వీరేపల్లి సత్యం, నలజాల గోవర్ధన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.