Beheaded for drinking: తాగొన్నందుకు తలలు నరికారు
--కొడవలితో దారుణంగా నరికి పరార్ -- మద్యం తాగొద్దన్నందుకు.. నలుగురి దారుణ హత్య
తాగొన్నందుకు తలలు నరికారు
–కొడవలితో దారుణంగా నరికి పరార్
— మద్యం తాగొద్దన్నందుకు.. నలుగురి దారుణ హత్య
ప్రజా దీవెన /తమిళనాడు: మద్యం తాగుతుండగా అడిగినందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడు లోని తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పల్లడం ప్రాంతానికి చెందిన సెంథిల్ ట్యూటికోరిన్ జిల్లాకు చెందిన వెంకటేశన్ ను డ్రైవర్ పెట్టుకొని పలు కారణాల వల్ల ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ క్రమంలో వెంకటేశన్ తన ఇద్దరు సహచరులతో కలిసి నిన్న సాయంత్రం సెంథిల్ ఇంటి ఆవరణలో మద్యం సేవించాడు.
తమ ఇంటి దగ్గర కూర్చుని మద్యం ఎందుకు సేవిస్తున్నా రని సెంథిల్ ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. వెంటనే వెంకటేశన్ తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచుకున్న కొడవళ్లతో సెంథిల్ తో పాటు అతడి తమ్ముడు మోహన్, బంధువులు రత్నమ్మాల్, పుష్ప వతి అనే నలుగురిని చంపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.