KVP Ramachandra Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) స్పందించారు. నిజానికి మన పార్టీ శ్రేయోభిలా షులు కొంతమంది ప్రభుత్వం మూ సి ప్రక్షాళనను మొదటిదశలో నూ,సుందరీకరణను రెండవ దశ లోనూ చేపడితే బాగుంటుందని మీకు సూచించవలసినదిగా నన్ను కోరినా.. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి, మీ ఆలోచన, విజన్, సమర్ధత పై నమ్మకంతో.. ఆ విషయం మీదృష్టికి తేలేదు.
నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫార్మ్ హౌస్ (Farm house)మీద, వారి స్వా ర్ధం కోసం, ప్రతిపక్ష నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తూ మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చా లని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా రు.సంబంధిత అధికారులను వెం టనే మా ఫార్మ్ హౌస్ (Farm house) కు పంపిం చండి. వారు చట్ట ప్రకారం అక్కడ ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేస్తే, ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫార్మ్ హౌస్ (Farm house)లో ఉంటే, 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా, మా స్వంత ఖర్చులతో ఆ కట్టడాన్నికూల్చి, ఆ వ్యర్ధాలను తొలగించి, శుభ్రం కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని నా కోరిక.