Thieves are plotting again for Paga: దోచినోల్లే మళ్ళీ పాగా కోసం కుట్రలు
-- తెలంగాణపై తాజాగా కొందరి దుర్బుద్ధి వ్యాఖ్యలు -- కేవీపీ, షర్మిలలు తెలంగాణ వాల్లమనడం హాస్యాస్పదం -- మీడియా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
దోచినోల్లే మళ్ళీ పాగా కోసం కుట్రలు
— తెలంగాణపై తాజాగా కొందరి దుర్బుద్ధి వ్యాఖ్యలు
— కేవీపీ, షర్మిలలు తెలంగాణ వాల్లమనడం హాస్యాస్పదం
— మీడియా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ : తెలంగాణను దోచినవాళ్లే మళ్ళీ ఇక్కడ పాగా వేయాలని దురలోచనతో కుట్రలు చేస్తున్నారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ రామచంద్ర రావు నేను తెలంగాణవాన్నే అనడంలో ఓ పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. నల్లగొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆనాడు తెలంగాణను రాకుండా అడ్డుపడి కుట్ర పన్నింది కేవీపీ రామచంద్రరావు అని ఆరోపించారు.తెలంగాణ లో రాజన్న రాజ్యం తెస్తా అని షర్మిల వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.కిరాయి మనుషులతో పాదయాత్ర చేసినంత మాత్రాన ఆమెను తెలంగాణ ప్రజలు ఆదరించరని గుర్తు చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రాజన్న పాలన కంటే వంద రేట్లు ఎక్కువగా తెలంగాణ ప్రజలు, అన్నదాతలు సంతోషంగా ఉన్నారని వివారించారు.షర్మిల కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని, అవినీతి చేసి జైలుకు జీవితం గడిపిన కుటుంబం వాళ్ళదంటూ దుయ్యబట్టారు.
ఆంధ్రలో రాజకీయాలు చేయడం ఆమెకు చేత కాక తెలంగాణలో తిరుగుతోందని, తెలంగాణను దోచుకోవాలి అనేది షర్మిల కుట్రగా అభివర్ణించారు. తెలంగాణ పై ఆధిపత్యం కోసమే వీరoదరి ప్రయత్నమని అందుకే కెవిపి ,షర్మిల ,రేణుక చౌదరి లాంటి వాళ్ళు తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టారని విమర్శించారు.
రాష్ట్రాన్ని దోచుకోవాలని కుట్ర చేస్తున్నారని, సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ మళ్ళీ పోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు ఆలోచన చేయాలని, సమైక్యాంధ్ర వాదులకు ఎక్కడ స్థానం ఇవ్వకూడదని సూచించారు. చంద్రబాబు, వైయస్ జగన్ లు కూడా హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రలో రాజకీయాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణపై కుట్రలు చేస్తాం అంటే మాత్రం కుదరదని ద్వజమెత్తారు. జమిలి ఎన్నికలు అస్సలు సాధ్యం కాదని, బీజేపీ ప్రయోజనాల కోసమే జమిలి ఎన్నికలని విమర్శించారు. మొదటినుండి ప్రధానమంత్రి మోడీకి తెలంగాణపై అక్కసు ఉన్నదని, దక్షిణాది రాష్టాలాంటే కూడా మోడీకి నచ్చదని, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి మోడీ వ్యతిరేకమని దుయ్యబట్టారు.