Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Maharashtra deputy speaker : సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యే లు

Maharashtra deputy speaker : ప్రజా దీవెన ముంబై:అక్టోబర్ 04 మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో (Narahari Jirwal) పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు శుక్రవారం ముంబైలోని (Mumbai) సచివాలయం లోని మూడో అంతస్తు నుంచి దూకారు. అక్కడ కట్టిన వలపై వారంతా పడ్డారు. షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఒక వర్గాన్ని చేర్చ డాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ ఘటనకు పాల్ప డ్డారు. సచివాలయ భవనం పై నుంచి దూకి ఎవరూ ఆత్మహత్య (suicide)చేసుకోకుండా ఉండడానికి ఆ వలను 2018లో ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతనే నరహరి జిర్వాల్.

ఆయనతో పాటు ముగ్గురు శాసనసభ్యులు కలిసి ధన్‌గర్ కమ్యూనిటీని (Dhangar Community)షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. వారిలో ఎవరికీ ఎలాం టి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం కూడా కొందరు గిరిజన ఎమ్మెల్యేలు సచి వాలయ కాంప్లెక్స్ (Secretariat Complex) వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమం త్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా వారు నిరసన తెలపడం గమనార్హం.