Special campaign movement 4.0: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థాపరంగా ‘స్వచ్ఛత’ను పాటించే కార్యక్రమంతో పాటు చాలా కాలంగా పెండింగు పడ్డ వ్యవహారాలను కనీస స్థాయికి పరిమితం చేయడానికి భారత ఆహార సంస్థ, ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ (New Delhi) వారి ఆదేశాల మేరకు సంస్థ నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ (Special campaign movement 4.0) అక్టోబర్ 31 వ తేదీ వర కు నిర్వహించబడుతుందని సంస్థ నల్గొండ ఇన్చార్జి డివిజనల్ మే నేజర్ హీరా సింగ్ రావత్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 (Special campaign movement 4.0)ను రెండు దశల్లో ఆచరిస్తున్నారనీ, మొదటి దశ సన్నాహక దశ ను సెప్టెంబర్ 16 నుండి ప్రారంభించి అదే నెల 30న ముగించామనీ, రెండో దశ అయిన అమలు దశను మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ప్రారంభించి ఈ నెల 31వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.అంతేకాక ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాలైన (Key points)ఫైళ్ళ వర్గీకరణ, ఏరివేత, చరిత్రాత్మక రికార్డుల సంరక్షణ వంటి విషయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంస్థాగత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
