Dharma Raksha Foundation: ప్రజా దీవెన, నిడమనూరు: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్ కఫిర్ (Sheikh Kafir) ఇటివల రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించాడు, అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మండలానికి చెందిన ధర్మ రక్షా ఫౌండేషన్ (Dharma Raksha Foundation) కార్యదర్శి గోలి మోహన్ (Goli Mohan)ద్వారా విషయం తెలుసుకున్న ఫౌండేషన్ అధ్యక్షులు అనుముల నవీన్ కుమార్, ఫౌండేషన్ సభ్యుల సహకారంతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ రక్షా ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రాందాస్, కార్యదర్శులు చింతకాయల అంజి, గోలి మోహన్, మేదరి సైదులు, సహకార్యదర్శులు నేనావత్ శంకర్ నాయక్, గుండాల లక్ష్మయ్య మరియు నల్గొండ నియోజకవర్గ సభ్యులు ఏరకల రామకృష్ణ, నాగార్జున రంగయ్య, అక్బర్, ఉస్మాన్, జానిమియా, ఇబ్రాహీం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.