Palamuru Brahmanavadi Vasavi Kanyaka Parameshwari: నేడు 6,66,66666 రూపాయల 66 పైసల తో మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు దర్శనం
–వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం బ్రాహ్మణ వాడి పాలమూరు
— హైందవ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం
— పాలమూరు లో కొత్త చరిత్ర సృష్టించనున్న ఆర్యవైశ్య సంఘం
Palamuru Brahmanavadi Vasavi Kanyaka Parameshwari: ప్రజాదీవెన, మహబూబ్ నగర్: పాలమూరు బ్రాహ్మణవాడి వాసవి కన్యకా పరమేశ్వరి (Palamuru Brahmanavadi Vasavi Kanyaka Parameshwari)దేవాలయం పట్టణ అర్య వైశ్య సంఘం (Arya Vaishya Sangam)నేడు ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు మహాలక్ష్మీ దేవి రూపంలో 6,66,66666 రూపాయల 66 పైసల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇంతకుముందు మనం ఎన్నడూ చూడని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవాలయ అలంకరణ అమ్మవారి అలంకారం చేయబోతున్నారు. హైందవ బంధువులందరూ (All Hindu relatives) అమ్మ వారి భక్తాదులందరూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తరించగలరని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు ,కార్యదర్శి మిరియాల వేణుగోపాల్ కోశాధికారి తల్లం నాగరాజు ఆహ్వానం పలికారు.
దేవాలయాలకు విచ్చేసిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి సన్నిధిలో ఉంచి లక్ష్మీ పూజ చేసిన కాయిన్(రూపాయి బిళ్ళ) అందరికీ ప్రసాదంగా ఇవ్వబడుతుందన్నారు. ఈ రోజు ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు (Goddess Vasavi Kanyaka Parameshwari) మహా లక్ష్మి రూపంలో 6 కోట్ల 66 లక్షల 66, వేల 666 రూపాయల 66. పైసల చే అలంకరణ ఉంటుందని తమిళ నాడు నుండి ప్రత్యేక నిపుణులు అమ్మ వారిని అలంకరించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న హైందవ భక్తులందరికీ అన్నదానము చేస్తున్నామన్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని వారు ఆకాంక్షించారు.