Piles Remedies: ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది పైల్స్ (Piles ) సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఇక సాధారణంగా పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అని పిలుస్తారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. దీనినే పైల్స్ అని అంటారు.
వాస్తవానికి ఈ సమస్య జీవనశైలి, ఆహారపు అలవాట్ల (Lifestyle and food habits) వల్ల వస్తుంది అని డాక్టర్లు తెలుపుతున్నారు. అలాగే వాత, పిత్త, కఫం శరీరంలో వికృతమైనప్పుడు దానిని త్రిదోషజ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి కొన్ని ఇంటి నివారణలను కూడా పాటించాలి అవి ఏమిటంటే.
1. పైల్స్ (piles) రోగులు తప్పనిసరిగా అలోవెరా ను వాడాలి. కలబంద గుజ్జును తింటే పైల్స్ చాల సులువుగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఫైబర్ అధికంగా ఉండే కలబంద జ్యూస్ తాగడం చాల మంచిది. ఇక అలోవెరా అంతర్గత మరియు బాహ్య పైల్స్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం రోజూ 200-250 గ్రాముల కలబంద గుజ్జును తింటే సరి. ఇది మలబద్ధకాన్ని నివారించి ప్రేగు కదలికలను సులువుగా ఉంచుతుంది. పైల్స్ (piles) మంటను తగ్గించడానికి అలోవెరా జెల్‌ను కూడా వాడుకోవచ్చు.
2. పైల్స్ (piles) సమస్యకు మరో మంచి చికిత్స సోంపు మరియు జీలకర్ర. జీలకర్ర బ్లడీ పైల్స్‌లో చాలా ప్రభావవంతం చేస్తాయి. జీలకర్రను వేయించి చక్కెర (sugar) మిఠాయితో రుబ్బాలి. అదేవిధంగా మెంతికూరతో గ్రైండ్ చేసి పంచదార కలపాలి. ఈ పొడిని 1-2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2-3 సార్లు తింటే సరి. జీలకర్రను మజ్జిగతో కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లో ఉపశమనం లభిస్తుంది.
3. బొప్పాయి (papaya)దీర్ఘకాలిక మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రోజూ ఒక ప్లేట్ బొప్పాయిని తింటే పైల్స్ సమస్యను తగ్గిచుకోవచ్చు . బొప్పాయిలో పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది.దింతో మన కడుపులో శుభ్రపరుస్తుంది. పైల్స్ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.