Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BUMPER OFFER: బంపర్ ఆఫర్…టాటాల నుంచి మరో కొత్త స్కీమ్.. రేపటి నుంచే షురూ

BUMPER OFFER: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: మ్యూచు వల్ ఫండ్స్‌లో (Mutual funds) పెట్టుబడి పెట్టేందు కు కొత్త స్కీమ్స్ కోసం ఎదురుచూ స్తున్న ఇన్వెస్టర్లకు (to investors)బంపర్ ఆఫర్. ఈ వారం ఏకంగా 11 మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఫండ్లకు అదనపు బెనిఫిట్స్ జోడిం చి కొత్త ఫండ్లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. మొత్తంగా 8 కేటగిరీల్లో ఈ కొత్త ఫండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మూడు ఇండెక్స్ ఫండ్స్, రెండు థెమాటిక్ ఫండ్స్, ఒక టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్, ఒక ఈటీఎఫ్, ఒక అదర్ ఈటీఎఫ్ ఫండ్ (A multi-cap fund, a small-cap fund, an ETF, and another ETF fund). ఇందు లో ప్రధానంగా చెప్పుకోవాలంటే టాటాల నుంచి న్యూ ఫండ్ ఆఫర్ వస్తోంది. టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థ తీసుకొస్తున్న సరికొత్త ఫండ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే టాటా నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ టాటాల నుంచి వస్తున్న టాటా నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ అనేది బెంచ్‌మార్క్‌గా పని చేయనుంది. నిఫ్టీ 500 ఇండెక్స్ స్టాక్స్ పని తీరును ఇది ట్రాక్ చేయనుంది. ఆరు నెలల ఫ్రీ ప్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 లార్జ్ క్యాప్ స్టాక్స్‌ని ఎంపిక చేశారు. ఈ న్యూ ఫండ్ ఆఫర్ అక్టోబర్ 7, 2024 రోజున సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21, 2024 వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది. యూనిట్లు కేటాయించిన కొద్ది రోజుల్లోనే ఓపెన్ మార్కెట్‌లోకి క్రయ విక్రయాల కోసం అందుబాటులోకి రానుంది.

టాటా నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్ (Tata Nifty Capital Markets Index Fund)ఒక థెమాటిక్ ఫండ్. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.1000 చొప్పున పెంచుకుంటూ ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. లాకిన్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. అయితే, రిస్క్ అనేది ఎక్కుగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ ఫండ్ మేనేజర్‌గా కపిల్ మెనన్ వ్యవహరించనున్నారు. ఆయన టాటా మ్యూచువల్ ఫండ్‌తో 2006 నుంచి కలిసి పని చేస్తున్నారు. టాటా అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫండ్ అందిస్తోంది.

మరోవైపు.. ఈ వారం అందుబాటులోకి వస్తున్న 11 ఫండ్లలో మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్, మిరే అసెట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, మిరే అసెట్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, కోటక్ ఎంఎన్‌సీ ఫండ్, టాటా నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ పండ్, గ్రో గోల్డ్ ఈటీఎఫ్, ఎడెల్వేసిస్ నిఫ్టీ 500 మల్టీక్యాప్ మూమెంటమ్ క్వాలిటీ 50 ఈటీఎఫ్, హెలియోస్ మిడ్ క్యాప్ పండ్, శాంకో మల్టీ క్యాప్ పండ్, ట్రస్ట్ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా ఎస్ఎల్ క్రిసిల్ (Aditya Birla SL Crisil)ఐబీఎక్స్ ఏఏఏ ఎన్‌బీఎఫ్‌సీ హెచ్ఎఫ్‌సీ ఇండెక్స్ డిసెంబర్ 2024 ఫండ్ సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి.