Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gold Lovers: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ ..?

Gold Lovers: మహిళలకు శుభకార్యం ఏదైనా సరే .. పండుగ ఏమైనా సరే.. మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ క్రమంలో అటు మహిళలకు, ఇటు మడుపరులకు ఊరటనిచ్చే వార్త ఇది అని చెప్పాలి. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. సోమవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ (Hyderabad, Vijayawada, Visakha) నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం ..

సోమవారం నాడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 10 తగ్గి రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 71,190గా ఉండగా . అటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర నడుతోస్తుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం (gold)ధర రూ. 71,340గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,810గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,190గా ఉంది.

ఇక వెండి (silver) ధరలు కూడా బంగారం (gold) బాటలోనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం దాదాపుగా రూ. 2 వేలు పెరిగిన వెండి ధర.. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. సోమవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 96,900 దగ్గర ఉండగా . ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,02,900గా ఉండగా . అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 91,900గా ఉన్నటు సమాచారం .. ఈ బంగారం వెండి ధరలు చూసి సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.