Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణ యం.. గురుకులాల్లో పది పాస్ కాగానే నేరుగా ఇంటర్మీడియట్ అవకాశం

Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా పాలన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభు త్వం విద్య కు ప్రథమ స్థానం కల్పిస్తున్నామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)వెల్లడించారు. బంజారా హిల్స్ లోని కొమురంభీమ్ భవన్ (Komurambheem Bhawan) లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విసృ త స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కలిసి దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో గురుకులాల పనితీరు పై వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకు న్నారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ లకి మించి తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు రాబోతున్నాయని ఇందు కోసం ఈ సంవత్సరానికి 5 వేల కోట్లు కేటా యించిందని తెలిపారు. బీసీ గురు కులాలు రాష్ట్రంలో ప్రథమ స్థానం లో ఉండాలని ఈ సంవత్స రానికి 100 శాతం ఉత్తీర్ణత సాధిం చాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

అధికారుల పనితీరు మరింత మెరుగుపరు చుకోవాలని సూచిం చారు. మెస్ చార్జీల పెంపు (Increase in mess charges)ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని గ్రీన్ ఛానెల్ (Green channel)ద్వారా బిల్లులు చెల్లిస్తా మని హామీ ఇచ్చారు. విద్యార్థులు అదనపు కరికులం యాక్టివిటీస్ దృష్టి సారించాలనీ సూచించా రు.వచ్చే విద్యా సంవ త్సరం నుండి ప్రస్తుతం మోడల్ స్కూల్ లో అమలవుతున్న మా దిరి గురుకులాల్లో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్ళేలా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్ కంప్యూటర్ తో పాటు అన్ని కోర్స్ లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్, NCC, NSS , స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండిటిలో ఉండేలా చూడాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం సూచించారు. అన్ని గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎంసెట్ ,నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.

గురుకులాల్లో ఏఎన్ఎం లు విధిగా విద్యార్థుల ఎత్తు ,బరువులు (Height and weight) కొలవడంతో పాటు రక్తహీనత లేకుండా చూడాలని సూచించారు. గురుకుల సమస్యల పై ఎమ్మెల్యే ,ఎంపి ఆ జిల్లా మంత్రి ,ఎమ్మెల్సీ లు వారి నిధుల నుండి కేటాయించేలా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. దసరా సెలవుల అనంతరం ఈనెల 15 – 31 లోపు ప్రతి గురుకులాల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారి నుండి సలహాలు సూచనలు తీసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలన్నారు. దసరా పండగ లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని యజమాని తో మాట్లాడి భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా వారితో మాట్లాడాలని సూచించారు. విద్యార్థులు క్రీడలు , కల్చరల్ యాక్టివిటీస్ , ఫిజికల్ ఫిట్నెస్ , వ్యాసరచన పోటీలు ఏదైనా అంశంపై డిబెట్ లు ,సైన్స్ ఇన్నోవేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. స్టడీ సర్కిల్ల ద్వారా మోటివేషన్ స్పీచ్ ఏర్పాటు చేయాలని , రికార్డు ఆన్లైన్ క్లాస్ లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురుకుల లో బాక్స్ ఏర్పాటు చేసి ఆర్సిఓ లు పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల లకు స్థల పరిశీలన చేయాలని త్వరలోనే భావనల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని గురుకులాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని 11 వందల కోట్లతో 25 వేల పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించామని 19 వేల మందికి ప్రమోషన్లు ,35 వేల మందికి బదిలీలు చేపట్టినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు . ఎస్సి,ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో నియామకాలు పూర్తి చేశామన్నారు. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మోడల్ స్కూల్ సిబ్బందికి కూడా బదిలీలు పూర్తి చేశామని తెలిపారు.

అనంతరం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం (Burra Venkatesham)మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ కి మంచి చరిత్ర ఉందని నాణమైన విద్యతో పాటు పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందించాలని సూచించారు. విద్యార్థులు 360 రోజుల్లో 300 రోజులు మీతోనే ఉంటారని వారిని మీ సొంత పిల్లల మాదిరి చూసుకోవాలని సూచిం చారు. నాయకత్వ దోరణి లో బిసి గురుకులాలు వెళ్తున్నా యని సూచించారు. ఎస్సి ,ఎస్టీ, మైనార్టీ గురుకులలకు బీసీ గురుకు లాలు ఆదర్శంగా ఉన్నామని తెలి పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ కాంప్లెక్స్ వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉండ వన్నారు. సంవత్సరానికి 5-6 లక్షలు ఫీజ్ కట్టిన అలాంటి స్కూల్ లు ఉండవని ముఖ్యమంత్రి గారి ముందస్తు దృష్టితో కొత్తగా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు వస్తున్నాయన్నారు ఒక్కో విద్యార్థి ఒక్కో అంశంలో నిపుణు లుగా ఉండేలా ప్రోత్స హించాలని సూచించారు.

హాస్టల్ వార్డెన్ లు ప్రమోషన్ల పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామ ని హామీ ఇచ్చారు. వారే సమస్య పరిష్కారం చేసుకొని రావాలని సూచించారు. డిబిసిడివోస్ , ఏడి బిసిడివోస్ పోస్టులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు. బీసీ గురుకులాల్లో చదివే పిల్లలకు సమాజంపై అవగాహన కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సూచించారు.సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు , ఎంబీసీ కార్పోరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్ర శేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా ,బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , డిబిసిడివొస్, ఏడిబిసిడివొస్, ఆర్సివోస్, డిసివోస్, ప్రిన్సిపల్స్ ,హాస్టల్ వార్డెన్ లు పాల్గొన్నారు.