Cotton buying centres: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి కార్య క్రమంలో (Public speaking agenda) భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశం మందిరం లో ప్రజల వద్ద నుండి విద్యార్థు లను స్వీకరిం చారు. కాగా ఈ సోమ వారం( 56) మంది ఫిర్యా దుదా రులు వారి ఫిర్యాదులను సమ ర్పించగా, ఇందులో రెవెన్యూ సం బంధించి నవి (16),ఇతర శాఖలకు సంబం ధించి (40) పిర్యాదులు ఉన్నా యి.అనంతరం నిర్వహించి న జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశం లో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై అధికారు లతో సమీపించారు. రైతు లకు ఇబ్బంది లేకుండా పత్తిని కొనుగోలు చేయా లని, జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాల ను ఈనెల 15లోగా ప్రారం భించాలని సమావేశంలో నిర్ణ యిం చారు. రాష్ట్ర ప్రభుత్వం పొడ వు పింజ పత్తికి 7521 రూపా యలు, మధ్యస్థ పింజ పత్తికి 7121 రూపాయలు మద్దతు ధరను ప్రకటించిందని , కొనుగోలు దారులు మద్దతు ధర కన్నా తక్కు వగా కొనుగోలు చేయవద్దని అన్నారు.
వచ్చే సంవత్సరం నర్సరీల (nursey) ద్వారా కోటి మొక్కలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ రానున్న సంవత్సరంలో ఆయా శాఖల ద్వారా నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (collector)తెలియజేశారు.ఎల్ ఆర్ ఎస్ క్రమపద్దీకరణలో భాగంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పహాని, ఎఫ్డిఎల్ , బఫర్ జోన్ ల ఆధారంగా సమన్వయంతో క్రమబద్దీకరిం చాలని చెప్పారు. 15 రోజుల్లో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం లో పురోగతి కనిపిం చాలన్నారు. పూర్తయిన ఇందిర మ్మ ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపా రు.కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులను పరిశీలిం చి చెక్కుల పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశిం చారు.
మండల ప్రత్యేక అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై (Grain buying centres) దృష్టి సారించాలని, ప్రభుత్వం ప్రకటిం చిన మద్దతు ధర వచ్చేలా కొనుగో లు కేంద్రాలలో కొనుగోలు చేయా లని, కొనుగోలు కేంద్రాలను ప్రారం భించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు అన్నిం టిని జాప్యం లేకుండా పరిష్క రించాలని, అప్ప టికప్పుడే ఫిర్యాదులను పరి ష్క రించి పిర్యాదుదారుకు తెలియ జేయాలని, మండలాల్లో సైతం ఇదే పద్ధతి న పరిష్కరిం చాలని అన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
