PAN card: ప్రస్తుత రోజుల్లో ప్రతి బ్యాంకింగ్ అవసరాలకు పాన్ నెంబర్ (pan number) అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరి పాన్ కార్డులో ఆల్ఫా న్యూమెరిక్ నెంబర్ కచ్చితంగా ఉంటుంది. ఈ నెంబర్ ఇంగ్లిష్ అక్షరాలతో పాటు నాలుగు నెంబర్లతో వస్తుందని అందరికి తెలిసిందే. కానీ మనలో చాలా మందికి పాన్ నెంబర్ను ఎలా కేటాయిస్తారనే అన్న విషయం తెలియదు. ఈ నంబర్ల ద్వారా మన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు నెంబర్ను ఎలా కేటాయిస్తారు? ఈ నెంబర్ అర్థం ఏంటి? వంటి విషయాలను మనం ఇప్పడు చూద్దాం..
సాధారణంగా ప్రతి ఒక్కరి పాన్ కార్డుపై ప్రతి ఒక్కరి పేరు, పుట్టిన తేదీ ఉండడం అందరికి తెలిసిందే. అయితే పాన్ నెంబర్లో కూడా ఇంటి పేరు ఉంటుందని చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. నిజానికి పాన్ కార్డులోని ఐదో అంకె మీ ఇంటి పేరును సూచిస్తుంది. అలాగే ఆదాయపు పన్ను శాఖ తన డేటాలో ఖాతదారుని ఇంటి పేరు మాత్రమే నమోదు చేస్తుంది. అందువల్ల పాన్ నెంబర్లో ఇంటి పేరును సూచించే ప్రత్యేక డిజిట్ గా ఉంటుంది. ఈ సమాచారం చాలా మంది పాన్ కార్డుదారులకు (For PAN card holders)తెలియదు అనే చెప్పాలి. అలాగే పాన్ కార్డులోని మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఉంటాయి. ఈ నెంబర్లు ప్రస్తుతం పాన్ నెంబర్ కేటాయించే సిరీస్లకు అనుగుణంగా మాత్రమే ఉంటాయి.
అలాగే పాన్ కార్డులోని నాలుగో డిజిట్ కూడా అక్షరమే. ఇది కార్డుదారుని స్థితిని తెలియజేస్తుంది. నాలుగో అక్షరానికి చాలా అర్థం ఉంటుంది. పి అని ఉంటే పరనల్ అని, ఎఫ్ అని ఉంటే ఫమ్, సి అంటే కంపెనీ, ఎ ఉంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని, టి అంటే ట్రస్ట్, హెచ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబం, బి అంటే పర్సనల్ బాడి, ఎల్ అంటే లోకల్ బాడీ, జె అంటే ఆర్టిఫిషియల్ జ్యూడిషియల్ పర్సన్ అని, జి అంటే ప్రభుత్వం అని అర్థం ఉంటుంది.. పాన్ కార్డులోని ఐదో అంకె ఆంగ్ల అక్షరం. ఇది మీ ఇంటి పేరులోని మొదటి అక్షరం. దీని తర్వాత పాన్ కార్డులోని నాలుగు నెంబర్లు ఉంటాయి. ఇది 0001 నుంచి 9999 వరకు ఎంతైనా ఉండవచ్చు. అయితే పాన్ కార్డులోని (pan card)చివర అంకె కూడా ఆంగ్ల అక్షరంమీ . ఈ నెంబర్ A నుంచి Z వరకు ఏదైనా ఉండవచ్చు. చుడండి మీరు కూడా ఒక సరి మీ పాన్ కార్డు నెంబర్ (pan card)ను పరిశీలన చేయండి.. మీకే అర్థం అవుతుంది.