Lions Club: ప్రజా దీవెన, శాలిగౌరారం: సమతుల ఆహారం తీసుకున్నపుడే తోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యoగా ఉంటారని లయన్స్ క్లబ్ (Lions Club) పాస్ట్ జోన్ ఛైర్మెన్ యర్ర శంభు లింగారెడ్డి (Yarra Shambhu Lingareddy) అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 వారం గర్భిణీ స్త్రీలకు (For pregnant women)పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా శంభులింగారెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికహారం తోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో పౌష్టికాహర దాతలు దేవరశెట్టి మహేష్,వారి తండ్రి లయన్ దేవరశెట్టి పెద శ్రీనివాస్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ,చార్టర్ ప్రసిడెంట్ బుడిగే శ్రీనివాసులు,డీసీ మెంబర్ గంట అంజిరెడ్డి, మండల వైద్యాధికారి సూర్య శిల్ప,పిహెచ్ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్ మరియా,సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధరెడ్డి,లయన్ క్లబ్ కార్యదర్శి మారోజు వెంకటాచారి, కోశాధికారి వడ్లకొండ బిక్షం,సభ్యులు దునక వెంకన్న,గుండ్ల రామ్మూర్తి, గండూరి విజయ లక్ష్మి,ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.