Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ram Charan: ఆ డైరెక్టర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ..?

Ram Charan: తాజాగా రామ్‌చరణ్‌ (Ram Charan)కు సంబందించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సినిమా ఒకే అయినట్టు తెలిసితోంది. డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి అందరికి విదితమే. ఇక ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ప్రభాస్‌, ఎన్టీఆర్‌ (Prabhas, NTR)సినిమాలకు ఒకే చెప్పారు. అ సినిమాలు పూర్తయిన అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా 2029లో ఉంటుందని తెలుస్తోంది. అయితే మెగా అభిమానులకు నిజంగా శుభవార్తే. ఇదిలావుంటే.. రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు రిలీజ్‌ చేస్తూ ఫ్యాన్స్‌లో ఆశలు కల్పిస్తున్నారు సంగీత దర్శకుడు తమన్‌. ‘గేమ్‌చేంజర్‌’ టీజర్‌ దసరాకు విడుదల అవ్వబోతుందని గతంలో వార్తలు వచ్చాయి .

ఈ విషయం పై తాజాగా తన ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు తమన్‌. ‘దసరాకు టీజర్‌ లేదు. నిరాశ పడొద్దు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. అవుట్‌పుట్‌ విషయంలో ఎక్కడా రాజీపడటంలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నది తెలిపారు. సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ (Final editing, dubbing, background)పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక ఈ సినిమా విడుదలయ్యేవరకూ ప్రతి నెలా ఒక లిరికల్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశాం. ఈ నెల 30న మరో పాట రాబోతుంది అని అన్నారు. అలాగే.. అభిమానుల కోసం ఈ దీపావళికి టీజర్‌ పక్కా. డిసెంబర్‌ 20న సినిమా విడుదల ఖాయం’ అని పోస్ట్‌ పెట్టి, అభిమానుల్లో ఆనందాన్ని నింపేశారు తమన్‌. దీనితో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం లో ఉన్నారు.