Siliveru Venkateswarlu: ప్రజా దీవెన,కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ కోర్టు అడిషనల్ (Kodada Sub Court Addl) పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది శిలివేరు వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కోదాడ బార్ అసోసియేషన్ లో గత మూడు దశాబ్దాలుగా సిలివేరు వెంకటేశ్వర్లు (Siliveru Venkateswarlu) న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆయన గతంలో కోదాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, ఎస్బిఐ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం 10వ తరగతి వరకు చిట్యాల ప్రభుత్వ పాఠశాల లో, ఇంటర్ రామన్నపేట ప్రభుత్వ కళాశాల లో , డిగ్రీ హైదారాబాద్ లోని అంబేద్కర్ కళాశాల (Ambedkar College) లో , లా డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఎపీపీ గా ఎంపికైన సందర్బంగా సిలివేరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డీకి ధన్యవాదములు తెలిపారు.కాగా కోర్టులో (court)ఎ పీ పీ గా విధుల్లో చేరుతున్న వెంకటేశ్వర్లు ను స్నేహితులు, పలువురు న్యాయవాదులు, పురప్రముఖులు అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.