మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud: ప్రజా దీవెన మునుగోడు అక్టోబర్ 10 : నాంపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యుడు మాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నాటి రామలింగం గారి సేవలు మరువలేనివని మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud)మంగళవారం సాయంత్రం రోజున కర్ణాటక సంతాప సభలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం కర్నాటి రామలింగం గారి సేవలను గుర్తు చేసుకుని మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుటకు ప్రముఖ పాత్ర వహించారని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం( Mandal Parishad Development Office) నిర్మాణమునకు తన తల్లిదండ్రుల పేరు మీద కర్నాటి రామచంద్రం పార్వతమ్మ (Ramachandram Parvathammaచేతుల మీదుగా రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించి ప్రారంభించుటలో ప్రముఖ పాత్ర వేయించారని పాత జ్ఞాపకాలను వేశారు.
అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉండి నాంపల్లి మార్కెట్ అసంపూర్తి దశలో ఉన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అహర్నిశలు కృషిచేసి ప్రహరీ గోడను కార్యాలయం పూర్తి చేశారని చెప్పారు భద్రాచలం దేవాలయం కమిటీ మెంబర్ గా ఉండి జిల్లా ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి (bjp)రాష్ట్ర నాయకులు ఏ రెడ్ల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణాటక విద్యాసాగర్ బీజేవైఎం రాసిన నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ పానుగంటి వెంకన్న గౌడ్ బీజేఎం మండల శాఖ అధ్యక్షులు సతీష్ బిజెపి మండల నాయకులు చిరుమామిళ్ల గిరిబాబు సింగారపు గిరి తదితరులు పాల్గొన్నారు